ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్సీ, తాతా మధుసూదన్ రావు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం గ్రామానికి చెందిన ఆడపు సతీష్ ఇటీవల పంచర్ షాప్ వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందారు.
సతీష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు, పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకుని, ఆయనకు మనోధైర్యం నూరిపోశారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 98









