భద్రాద్రి కొత్తగూడెం: బూర్గంపహడ్ బస్టాండ్‌లో ప్రజలకు ఆరోగ్య అవగాహన. భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ పుల్లారెడ్డి, ఎయిడ్స్ & లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్ పర్యవేక్షణలో ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా మేనేజర్ సత్య కుమార్ పర్యవేక్షణలో పోలూరి రాము జానపద కళాబృందం పల్లె సుద్దులు కళారూపాల ద్వారా హెచ్ఐవి, సుఖ వ్యాధులు, ఏఆర్టీ, ఐసీటీసీ సేవలు, 1097 టోల్ ఫ్రీ నంబర్, రక్తదానము తదితర ఆరోగ్య అంశాలపై ప్రజలకు నాటికల ద్వారా వివరించారు.
కార్యక్రమంలో ఐసిటిసి కౌన్సిలర్ వీరయ్య, సెక్యూర్ స్వచ్చంద సేవా సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ హరికృష్ణ, సిబ్బంది జిఎన్ఎమ్ పద్మ, కలారులుగా పోలూరి రాము, కొచ్చర్ల గురవయ్య, ఊటుకూరి రాంబాబు, గంట నాగలక్ష్మి మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.









