విద్యార్థుల్లో క్రమశిక్షణ కోసం తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమని ఎస్సై రామకృష్ణ జాడి పిలుపు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తనలో మార్పు కోసం తల్లిదండ్రులు ముందడుగు వేయాలని భద్రాచలం ఎస్సై రామకృష్ణ జాడి పిలుపునిచ్చారు.
పిల్లలపై శ్రద్ధ, నియంత్రణ లేకపోవడం వల్లే వారు చెడు అలవాట్లు అలవర్చుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. “గురువుల పట్ల గౌరవం, భయం లేకపోవడం సమాజానికి ప్రమాదకరం” అని హెచ్చరించారు.
తల్లిదండ్రుల గారాబం, నిర్లక్ష్యం, అతి ప్రేమ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తోందని జాడి పేర్కొన్నారు. చిన్నప్పటినుంచే పిల్లల్లో బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టాన్ని అర్థం చేసుకునే అలవాటు పెంచితేనే సమాజం మారుతుందని అన్నారు.
Post Views: 38









