కరకగూడెంలో మండల స్థాయి TLM మేళా విజయవంతం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్
కరకగూడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన మండల స్థాయి ఉపాధ్యాయుల TLM మేళా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల ఘనంగా ప్రారంభించారు.
ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతతో బోధన–అభ్యసన సామగ్రిని ప్రదర్శించగా, ఎంపికైన వారు జిల్లా స్థాయి మేళాలో పాల్గొననున్నారు. విద్యా నాణ్యత పెంపొందించడంలో ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమని ఎంవీఓ అన్నారు.
Post Views: 30









