శంషాబాద్ విమానాశ్రయంలో ₹14 కోట్ల గంజాయి పట్టివేత
సిటిజన్ టైమ్స్, ఆధాబ్ న్యూస్:
శంషాబాద్ విమానాశ్రయం భద్రతా అధికారులు బుధవారం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు దగ్గర 13.9 కిలోల గంజాయిను పట్టుకున్నారు.
నిందితుడిని హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు ₹14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ, రాష్ట్రంలో తరచూ గంజాయి, మత్తు పదార్థాల దందాలు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Post Views: 25









