విద్యుత్ షాక్‌తో మూడు గేదెలు మృతి
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం తిర్లాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొలాల్లోకి వెళ్ళే 11 కెవి విద్యుత్ వైర్ తెగిపోవడంతో మూడు గేదెలు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాయి.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం, ఊకే శ్రీను కు చెందిన రెండు గేదెలు, పూసం అఖిల్ కు చెందిన ఒక గేదె దుర్మరణం పాలయ్యాయి. పాడి గేదెలు మృతి చెందడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వం కోరుతున్నారు.
Post Views: 52









