ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే నలుగురు దుర్మరణం
హైదరాబాద్ , ఆధాబ్ న్యూస్:
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తెలుసుకున్న వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు రాత్రి 2 గంటల సమయంలో అడ్డాకుల వద్ద ముందుకు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన ప్రభావంతో బస్సు క్లీనర్ హసన్ (35), అస్రాఫ్ ఉన్నిసా (70), ఎల్లమ్మ (40)తో పాటు మరో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
గాయపడిన ఐదుగురిని తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Post Views: 72









