ఓసి-2 కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ బుక్కులు, పే స్లిప్లు ఇవ్వాలి – ఐఎఫ్టీయూ
పినపాక,ఆగస్టు 27 ఆధాబ్ న్యూస్ : ఓసి-2 సివిక్ కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ అటెండెన్స్ బుక్కులు, ప్రతినెల పే స్లిప్లు అందజేయాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బుధవారం గని మేనేజర్ కె. సురేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు విని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.డి. నాసర్ పాషా మాట్లాడుతూ, సుమారు 15 మంది పైగా స్థానికులు, భూ నిర్వాసితులు పనిచేస్తున్నప్పటికీ ఇప్పటివరకు వారికి మెడికల్ బుక్కులు ఇవ్వలేదన్నారు. ఉచిత వైద్యానికి అవి తప్పనిసరి కాబట్టి వెంటనే అందించాలని, అలాగే జీతం–మినహాయింపుల వివరాలతో పే స్లిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గని మేనేజర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సంక్షేమ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









