పిచ్చి కుక్క దాడికి ఏడాది పసికందు గాయాలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏడాది పసికందు సౌందపు ఈశన్విక్ పిచ్చి కుక్క దాడి చేసింది.
ఇంటి వరండాలో ఆడుకుంటున్న బాబుపై అకస్మాత్తుగా కుక్క దూసుకొచ్చి తీవ్రంగా గాయపరిచింది. ఆ సమయంలో తల్లి గృహకార్యాల్లో ఉండగా దాడి జరిగినట్లు తల్లిదండ్రులు సంతోష్, వెన్నెల తెలిపారు.
గాయపడిన చిన్నారిని వెంటనే మణుగూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి భద్రాచలానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సంఘటనతో గ్రామంలో ఆందోళన వ్యాపించింది. వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్థులు అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Post Views: 47









