బ్రేకింగ్ న్యూస్: ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
జిల్లాలో అవినీతి మరోసారి బహిర్గతమైంది. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని ఒక ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండి రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్, యూరియా అమ్మకాలపై జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకునేందుకు ఆ మొత్తం తీసుకోవాలని కోరాడు.
ఈ క్రమంలో, నేడు ఆయన విద్యానగర్ కార్యాలయంలో డబ్బు స్వీకరిస్తున్న సమయంలో, ఏసీబీ అధికారులు డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలో దాడి చేసి, నర్సింహారావును రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనతో జిల్లా వ్యవసాయ శాఖలో కలకలం రేగింది. అధికారుల అవినీతి చర్యలపై రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 35









