టేకులపల్లి మండలంలో భారీగా గంజాయి పట్టివేత
₹2.12 కోట్ల విలువైన 425 కిలోల గంజాయి స్వాధీనం
టేకులఅల్లి,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం
సీసీఎస్ టేకులపల్లి పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్న 425 కిలోల గంజాయి (విలువ సుమారు ₹2.12 కోట్లు)ను లారీ ద్వారా వెళ్తుండగా, టేకులపల్లి మండలంలోని వెంకటీయాతండా వద్ద పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విలేకరుల సమావేశం నిర్వహించిన ఇల్లందు డీఎస్పీ చంద్రభాను వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 92









