ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పినపాక యువకుడికి అండగా కుంజ సూర్యరామ్

పినపాక యువకుడికి అండగా కుంజ సూర్యరామ్

జాతీయ స్థాయి పోటీలకు ₹10,000 ఆర్థిక సాయం
పినపాక,ఆధాబ్ న్యూస్:
ఆదివాసీ కుటుంబానికి చెందిన పినపాక యువకుడు దబ్బగట్ల లోకేష్ క్రీడల్లో ప్రతిభ చూపించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పేదరికం కారణంగా పోటీల్లో పాల్గొనే అవకాశమే కోల్పోతానని ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్‌కి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్యరామ్ అండగా నిలిచారు.

లోకేష్‌కు జాతీయ పోటీలకు హాజరయ్యేందుకు కావలసిన ఖర్చుల నిమిత్తం సూర్యరామ్ రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. కిన్నెరసాని స్పోర్ట్స్ పాఠశాలలో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతున్న లోకేష్ అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి, హనుమకొండ మరియు జార్ఖండ్‌లో జరిగిన పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ విజయాలతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

సకాలంలో ఆర్థిక సహాయం అందించినందుకు లోకేష్ కుటుంబ సభ్యులు కుంజ సూర్యరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. లోకేష్ జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చి తెలంగాణకు గౌరవం తీసుకురావాలి” అని సూర్యరామ్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోడిశాల రామనాధం, సూర్యన్న టీం సభ్యులు పినపాక పట్టి నగర్ సతీష్, భాను, పొనుగోటి చందర్రావు, అచ్చా నవీన్, జరుపుల రాము నాయక్, కోడిరెక్కల సాయి కుమార్, కల్తీ ప్రభాకర్, అత్తె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!