కోదాడలో బీటు అధికారి ACB వలలో
సూర్యాపేట, ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట జిల్లా కోదాడ అటవీ రేంజ్ కార్యాలయంలో పనిచేస్తున్న బీటు అధికారి అనంతుల వెంకన్న లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల బారిన పడ్డాడు.
ఫిర్యాదుదారుని కలప వ్యాపారానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని ₹20,000 లంచం డిమాండ్ చేసిన అధికారి, డబ్బు స్వీకరిస్తున్న క్షణంలోనే ACB అధికారులు పట్టుకున్నారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరిన సందర్భంలో ప్రజలు తప్పనిసరిగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Post Views: 42









