ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్‌లో ఆదివాసి యువకుడు తొలెం శ్రీనివాస్ మెప్పింపు

మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్‌లో ఆదివాసి యువకుడు తొలెం శ్రీనివాస్ మెప్పింపు

పినపాక, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీ దేవనగరం గ్రామానికి చెందిన ఆదివాసి యువకుడు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తొలెం శ్రీనివాస్ ఓ వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగు ఓటీటీ వేదిక జీ5లో ఆగస్టు 8న విడుదలైన ‘మోతెవరి లవ్ స్టోరీ’ వెబ్ సిరీస్ వారం రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు సంపాదించి ట్రెండింగ్లో నిలిచింది. ఈ సిరీస్‌లో తొలెం శ్రీనివాస్ దుబాయ్ ఏజెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

విద్యా ప్రస్థానం:

చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి

పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్

ఇల్లెందులో డిగ్రీ

నల్లగొండలో బీఈడీ

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ (తెలుగు, డిస్టెన్స్) పూర్తి చేశారు.

అవకాశం ఎలా దక్కింది?
డైరెక్టర్ బుర్ర శివకృష్ణ, హీరో అనిల్ గిలా ఆశీర్వాదంతో ఈ వెబ్ సిరీస్‌లో నటించే ఛాన్స్ లభించిందని శ్రీనివాస్ తెలిపారు.

తాజాగా ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌లో స్థానిక యువకుడు నటించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి ఆయనకు అభినందనలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!