ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మణుగూరులో ఓసి విస్తరణపై నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరిన సామాజిక సేవకులు

మణుగూరులో ఓసి విస్తరణపై నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరిన సామాజిక సేవకులు

మణుగూరు,ఆధాబ్ న్యూస్:
మణుగూరు ఓపెన్‌కాస్ట్ (OC) విస్తరణకు సంబంధించి నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కర్నే బాబురావు మాట్లాడుతూ, మణుగూరు ఓసి విస్తరణ అవసరమని ప్రజాభిప్రాయ సేకరణ సభలో తాము సానుకూలంగా స్పందించినప్పటికీ, నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవాలని కోరుతున్నామని తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:

నిర్వాసిత గ్రామాల వారికి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలి.

స్థానిక SMS ప్లాంట్లు (బ్లాస్టింగ్ విభాగం) లో బహిర్గత ప్రాంతాల నుంచి కార్మికులను నియమిస్తున్నారని నిర్వాసితుల ఆరోపణలపై విచారణ జరిపి, తప్పుదారులు పట్టే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.

స్థానిక ఓబీ కంపెనీలలో పనికి వెళ్లిన నిర్వాసితులను “లోకల్ వాలెంకో ఇదర్ కామ్ నహీ మిల్తా, బాహర్ జావో” అంటూ తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. దీన్ని ఆపాలని, స్థానికులను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సివిల్ పర్చేస్ టెండర్లలో కూడా నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.

శిక్షణ పూర్తి చేసుకున్న అనేక మంది యువత, మహిళలు పని కోసం తిరుగుతున్నా ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రధాన అభ్యర్థన:
సింగరేణి ఎండి ఎన్. బలరాం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, స్థానికులు, సింగరేణి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు 80% ఉపాధి అవకాశాలు కల్పించేలా ఏరియా సింగరేణి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!