లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తాండూరు పురపాలక సీనియర్ అసిస్టెంటు
రంగారెడ్డి,ఆధాబ్ న్యూస్: తాండూరులో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి. రమేష్ లంచం స్వీకరిస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడు తాను నిర్మించుకున్న షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయించాలనగా, అందుకు ప్రతిగా ₹15,000 లంచం కోరిన రమేష్‌ను, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తరచూ అవినీతి రహిత పరిపాలన కోసం ప్రజలకు పిలుపునిస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
Post Views: 35









