విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలి : ఎస్ఎఫ్ఐ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కార్యదర్శి మదాసు అఖిల్ డిమాండ్ చేశారు.
వర్షాకాలం కారణంగా దోమల పెరుగుదలతో డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు, కలుషిత ఆహారం వల్ల టైఫాయిడ్, కలుషిత నీరు వాడటం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు స్నానానికి, తాగడానికి ఉపయోగించే నీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని, ఇప్పటికే జ్వరాల బారిన పడిన వారికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
అధికారులు నిమ్మకు నిర్రెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించిన అఖిల్, విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అసహ్యం కలిగిస్తోందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
– విప్లవాభివందనాలతో
ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కార్యదర్శి
మదాసు అఖిల్ (7569097884)









