ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీతక్క వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మంత్రి

సీతక్క వివాహ వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మంత్రి
హన్మకొండ,ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వివిధ ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ రోజు హన్మకొండలోని నాని గార్డెన్‌లో ములుగు మండలం అబ్బాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుండ భిక్షపతి మేనకోడలు వివాహానికి హాజరైన ఆమె, అనంతరం ములుగు మండలం ఇంచెర్లలోని ఎంఆర్ గార్డెన్‌లో నవ తెలంగాణ ఆర్‌సి ఇంచార్జి పిట్టల మధుసుధన్ కుమార్తె వివాహంలో పాల్గొన్నారు.

ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో మున్సిపాలిటీ ఎలక్ట్రిషన్ చౌద శ్రీనివాస్ కుమార్తె వివాహానికి, డిఎల్ఆర్ గార్డెన్‌లో యాసం ఐలోని కుమార్తె వివాహానికి సీతక్క హాజరయ్యారు. అలాగే గోవిందరావుపేట మండలం పసరలోని చెన్నారెడ్డి ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దేపాక కృష్ణ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!