ఘనంగా కృష్ణాష్టమి ఉత్సవాలు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో కృష్ణాష్టమి పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగకు మహిళలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
పిల్లలను బాలకృష్ణులు, గోపికల వేషధారణలో అలంకరించడం పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం రామలయం ఆలయంలో యువత ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గ్రామమంతా ఆనందకోలాహలంగా మారింది.
Post Views: 30









