కరకగూడెం మండలం భట్టుపల్లిలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామంలోని కొమరం భీమ్ సెంటర్‌లో ఆదివాసి సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భారత స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం. స్వాతంత్రం, సమానత్వం, సోదరభావం కోసం వారు పోరాడారు. యువత మహనీయుల ఆశయాల సాధనకు ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, నాయకులు పోలేబోయిన సర్వేష్, కొమరం శంకర్, కలం సంపత్, ఊకె నరేష్, పోలేబోయిన స్వామి ప్రసాద్, కొమరం అశోక్, పూనెం శంకర్, కొరగట్ల నరసింహారావు, గోగ్గల నరేష్ మరియు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 77









