: తెలంగాణలో మరో వారం రోజులపాటు కుండపోత వర్షాలు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
గత వారం రోజులుగా తెలంగాణలో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండగా, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 7 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం నుంచి ఆగస్టు 15 వరకు కుండపోత వర్షాలు కొనసాగనున్నాయని అంచనా. ఈ నెల 10, 11 తేదీల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 12, 13, 14, 15 తేదీల్లో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో విస్తారమైన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
హైదరాబాద్లో ఉదయం ఉక్కపోత, సాయంత్రం కుండపోత వాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
Post Views: 37









