ఐదుగురు రాగి వైర్ దొంగలు అరెస్ట్
డీఎస్పీ .రవీందర్ రెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రాగి వైర్ దొంగతనం కేసులో పోలీసులు
ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను డి.ఎస్.పి రవీందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో నాలుగు లక్షల రూపాయల విలువైన కాపర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఐదు సెల్‌ఫోన్లు, ఒక కీయ కార్, ఒక ద్విచక్ర వాహనం (స్కూటీ)లను స్వాధీనం చేసుకున్నారు.
కేసును చాకచక్యంగా చేదించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సురేష్‌తో పాటు పోలీస్ సిబ్బందిని డి.ఎస్.పి ప్రశంసించారు. స్థానిక ప్రజలు కూడా పోలీసుల కృషిని అభినందించారు.
Post Views: 145









