ప్రతి క్షణం
ప్రజల పక్షం

  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల డీటీవో భద్రూనాయక్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల డీటీవో భద్రూనాయక్

జగిత్యాల,ఆధాబ్ న్యూస్:
జిల్లా రవాణా అధికారి (డీటీవో) భద్రూనాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పట్టుబడిన జేసీబీ వాహనాన్ని వదిలేయాలని శశిధర్ అనే వ్యక్తి నుంచి రూ.22,000 లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉన్న భద్రూనాయక్, చివరి రోజుల్లోనే అవినీతికి పాల్పడుతూ దొరికిపోయారు. ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. పూర్తి సమాచారం కోసం ఏసీబీ అధికారులు త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!