కొత్తగూడ ఎస్ఐగా రాజ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
మహబూబాబాద్ ,ఆధాబ్ న్యూస్:
కొత్తగూడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా రాజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ప్రజలకు న్యాయం చేయడంలో పూర్తి నిబద్ధతతో పని చేస్తానని ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 76









