భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ప్రమాదం తప్పింది. కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఒక కంటైనర్ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహానీ జరగకపోవడం ఊరట కలిగించింది.
వాహనం స్పీడ్‌లో ఉండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినప్పటికీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని కదిలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
Post Views: 41









