మంత్రి తుమ్మల ఫోన్ చోరీ.. గంటలోనే ట్రేస్ చేసిన పోలీసులు!
కరీంనగర్,ఆధాబ్ న్యూస్:
కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో చిన్నపాటి హడావుడి చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొబైల్ ఫోన్ చోరీకి గురయ్యింది. అయితే, ఈ సంఘటనలో పోలీసుల చురుకైన చర్యతో గంట వ్యవధిలోనే ఫోన్‌ను ట్రేస్ చేసి, తిరిగి మంత్రికి అప్పగించారు.
పోలీసులు మొబైల్ ఫోన్ యొక్క లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి, ఆ ఫోన్ ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆయనను సంప్రదించి, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని మంత్రికి తిరిగి అప్పగించారు.
ఈ ఘటన మంత్రి తుమ్మల పర్యటనకు సెక్యూరిటీ పరంగా ప్రశ్నార్థకంగా మారినా, పోలీసుల వేగవంతమైన చర్య అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. అలాగే, ఈ సంఘటన రాజకీయంగా చిన్న సంచలనంగా మారింది
Post Views: 37









