ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ రవీందర్ రెడ్డి

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలలోనీ
యాన్యువల్  ఇన్స్పెక్షన్‌లో భాగంగా మణుగూరు  డీఎస్పీ వి. రవీందర్ రెడ్డి సోమవారం కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పలు రికార్డులను, ఆయుధాలను తనిఖీ చేశారు. మావోయిస్టు కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, గతంలో చోటు చేసుకున్న సంఘటనలను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రతపై పలు సూచనలు చేశారు. స్టేషన్ సిబ్బంది మరియు TGSP సిబ్బందితో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏడుల్లా బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పి.వి.ఎన్. రావు, ఇతర స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!