ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూ సూద్
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోమవారం ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో వెంకట్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త విని తీవ్రంగా కలచివేసిందని సోనూ సూద్ వ్యాఖ్యానించారు.
వెంకట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, ఆర్థిక సహాయం కూడా అందించినట్టు సమాచారం. వెంకట్ కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పిన సోనూ, వారి పట్ల తన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పారు.
Post Views: 64









