రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
నగరంలోని బాటసింగారంలో సోమవారం ఈగల్ టీమ్ భారీగా గంజాయి పట్టుబడింది. పండ్ల బాక్సుల మధ్య దాచిన గంజాయిని ఓ డీసీఎం వాహనంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ పట్టివేత జరిపారు.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 934 కిలోల గంజాయిను సీజ్ చేశారు. దాదాపు రూ.5 కోట్ల విలువగల ఈ గంజాయిని 35 సంచుల్లో ప్యాకింగ్ చేసిన 455 ప్యాకెట్లుగా గుర్తించారు.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.
Post Views: 28









