ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీ భర్తీ చేయాలి: ఏఐటీయూసీ నేత తోగటి కుమార్ డిమాండ్

జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీ భర్తీ చేయాలి: ఏఐటీయూసీ నేత తోగటి కుమార్ డిమాండ్

పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని ఏఐటీయూసీ మండల కార్యదర్శి తోగటి కుమార్ డిమాండ్ చేశారు.

సోమవారం రోజు పినపాక మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత సంవత్సరం జానంపేట ఆసుపత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్‌ను బదిలీ చేసిన తరువాత అక్కడ ఇప్పటివరకు మరెవరినీ నియమించలేదని తెలిపారు.

ఇప్పటికే వర్షాకాలం నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు విష జ్వరాలు, ఒళ్లు నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారనీ, ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వల్ల పేషంట్లు సమయానికి పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి, జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!