ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మానవత్వానికి మారు పేరు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

మానవత్వానికి మారు పేరు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం, ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బంగారుగూడెం వద్ద ఉదయం ప్రమాదం జరిగింది. మొక్కలు తరలిస్తున్న ట్రాక్టర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఆ సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించాడు. గాయపడిన డ్రైవర్‌కు ప్రథమ చికిత్స అందిస్తూ తన స్వంత వాహనంలో పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

ప్రమాద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి మానవీయ సహాయం అందించి, చురుకైన చర్యతో ప్రాణాలు కాపాడిన ఇక్బాల్ హుస్సేన్ చర్యలు ప్రశంసనీయంగా నిలిచాయి. ఒక నాయకుడిగా కాదు, మానవతా మనస్సుతో స్పందించిన ఆయన ప్రవర్తన సామాజికంగా ఆదర్శంగా నిలుస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!