కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ మరియు కంది పంట రైతులతో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తోందని, నాణ్యమైన విత్తనాల సరఫరా, సాంకేతిక మద్దతు, సాగుపై అవగాహన కల్పించేందుకు విత్తన అభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ సమ్మిదాన్ బచావో రాష్ట్ర నాయకులు బాలశౌరి, టీపీసీసీ సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలూరి కోటేశ్వరరావు, కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు.
సభకు సంబంధిత శాఖల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు, రైతులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమం రైతుల్లో నూతన ఆత్మవిశ్వాసం నింపిందని పలువురు అభిప్రాయపడ్డారు.









