బీసీ లకు 42% రిజర్వేషన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంగపేట బీసీ సెల్ అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ
పాలాభిషేకం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
మంగపేట, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో, మంగపేట మండల రాజుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మైల జయరామ్ రెడ్డి ల సూచనల మేరకు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పొట్రూ సమ్మయ్య ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ముత్తినేని ఆదినారాయణ మాట్లాడుతూ –
“ఎన్నికల సమయంలో కామారెడ్డి నియోజకవర్గంలో బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తూ బీసీ లకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని నెరవేర్చింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం దేశంలోనే తొలిసారి బీసీలకు అంత పెరిగిన రిజర్వేషన్ ను కల్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది” అని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, భాణా సంచ కాల్చారు.
ముత్తినేని ఆదినారాయణ మాట్లాడుతూ –
“ఈ అభివృద్ధి నిర్ణయానికి మంగపేట మండల బీసీ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, బ్లాక్ కాంగ్రెస్, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









