ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్.
హైదరాబాద్, జూలై 8 (ఆధాబ్ న్యూస్):
ఫిర్యాదిదారుని కంపెనీకి జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ చేసి నంబర్ పొందేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి రూ.8,000/- లంచం డిమాండ్ చేసిన హైదరాబాద్ మాధాపూర్ ప్రాంతానికి చెందిన ఉప రాష్ట్ర పన్నుల అధికారి ఎం.సుధ, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఎం.సుధను ఎస్బీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏసీబీ అధికారులు ప్రభుత్వ అధికారుల నుండి లంచం తీసుకునే ఘటనలపై శీఘ్ర చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Post Views: 44









