ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పాముకాటుతో 18 నెలల చిన్నారి పరిస్థితి విషమం.

 

కరకగూడెం, జూలై 8 (ఆధాబ్ న్యూస్): కరకగూడం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన ఊకే సారయ్య-నాగమణి దంపతుల కుమారుడు విక్రమ్ అనే 18 నెలల చిన్నారి పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

స్థానికుల చెబుతున్న వివరాల ప్రకారం, తల్లిదండ్రులతో కలిసి విక్రమ్ పత్తి గింజలు నాటేందుకు పొలం వద్దకు వెళ్లాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో ఉన్న సమయంలో బాలుడు పొలంలో ఉన్న పుట్ట వద్ద ఆడుకుంటూ అక్కడే పడిపోయాడు. కొద్దిసేపటికి బాలుడి నోటి నుండి నురగ రావడం గమనించిన తల్లిదండ్రులు పాముకాటు అనుమానించి, వెంటనే చికిత్స కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆపై 108 వాహనంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మణుగూరు హాస్పిటల్‌కు, అనంతరం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!