భద్రాద్రి కొత్తగూడెం ఇన్చార్జి డీఎంహెచ్ఓగా డాక్టర్ జయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO)గా డాక్టర్ జయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఆమె తాజాగా ఈ పదవికి నియమితులై, సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఆరోగ్య వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా కృషి చేస్తానని డాక్టర్ జయలక్ష్మి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Post Views: 37









