ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ను రక్తం వచ్చేలాగా కొట్టారు
ములుగు, ఆధాబ్ న్యూస్:
ములుగు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని కథనాలు ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి రిపోర్ట్ శ్రీకాంత్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు.
ములుగు జిల్లా తాడ్వాయి నుండి మేడారం వెళ్తుండగా, రహదారిపై కాపు కాసి శ్రీకాంత్ ను చితకబాదిన నార్లపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తండాల శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షుడు మొక్క శ్రీనివాస్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు బొప్ప వినోద్, ఎనగంటి సాయికృష్ణ .
దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రిపోర్టర్ శ్రీకాంత్. రిపోర్టర్ శ్రీకాంత్ పై దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
Post Views: 50









