సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ) ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. గతంలో ముగిసిన పంచాయతీ సభ్యుల పదవీ కాలం పూర్తయ్యిందని, ఎన్నికలు జరిపే బాధ్యతను ప్రభుత్వం తేల్చలేదని పేర్కొంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో, వచ్చే సెప్టెంబర్ 30 నాటికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని, ప్రజాప్రతినిధుల ఖాళీలను తొందరగా భర్తీ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Post Views: 47









