ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి: సీఎస్ కే. రామకృష్ణారావు

ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి: సీఎస్ కే. రామకృష్ణారావు

ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం పథకాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు అన్ని జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ తదితరులు ఐడీఓసీ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు:

రాష్ట్ర వ్యాప్తంగా 2.3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు, లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం.

డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండింగ్ పనులు లబ్ధిదారుల ద్వారా పూర్తి చేసుకునేందుకు మార్గదర్శకాలు.

500 మంది నిరుపేదలకు ప్రతి పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్లకు సూచన.

70 లక్షల మొక్కల నాటకానికి ఏర్పాట్లు, వన మహోత్సవం ప్రత్యేక కార్యాచరణపై దృష్టి.

ఎరువుల స్టాక్ సమృద్ధిగా అందుబాటులో ఉందని, రిటైల్ విక్రయాల డిజిటలైజేషన్ పై దృష్టి.

లక్షా 25 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు చర్యలు.

భూ భారతి చట్టం కింద 8.27 లక్షల దరఖాస్తులు, ఆగస్టు 15 లోపు పరిష్కారానికి టార్గెట్.

సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు, టీబీ ముక్త భారత్ లక్ష్యంగా వైద్య శిబిరాలు.

అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వన మహోత్సవాన్ని ప్రతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలనీ, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనేలా చేయాలనీ సూచించారు. కోతుల సంరక్షణకు ప్రత్యేక బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలనిచెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, 58345 భూ దరఖాస్తులు స్వీకరణలో ఉన్నాయని, వాటి పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వన మహోత్సవంలో ప్రజల భాగస్వామ్యం కోసం విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, పంచాయతీరాజ్ అదనపు కలెక్టర్ విద్యా చందన, వ్యవసాయ అధికారి బాబురావు, వైద్యాధికారి భాస్కర్ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!