తిర్లాపురం వ్యక్తి పోగొట్టుకున్న సెల్ ఫోన్ను గంటలలోనే చేదించిన ఏడూళ్ళ బయ్యారం పోలీసులు
పినపాక,ఆధాబ్ న్యూస్:
తిర్లాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మణుగూరు నుండి తిరిగి వస్తుండగా తాను ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే పోలీసులను సంప్రదించగా, ఏడూళ్ళ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం తక్షణమే విచారణ ప్రారంభించింది.
ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, సమీప ప్రాంతాల్లో స్థల పరిశీలన చేసి, క్రమశిక్షణతో చేపట్టిన చర్యల ఫలితంగా గంటల వ్యవధిలోనే మొబైల్ ఫోన్ను గుర్తించి, బాధితునికి అప్పగించారు. ఈ సందర్భంగా బాధితుడు పోలీసుల స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
పబ్లిక్ ప్రాపర్టీ మరియు వ్యక్తిగత వస్తువుల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.









