పబ్లిక్ టాయిలెట్లను వెంటనే మంజూరు చేయాలి: ఎంపీడీవోకు ఆటో యూనియన్ వినతి
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
మండల కేంద్రంలోని ప్రయాణికులు, వాహనదారులు మరియు సాధారణ ప్రజలు మూత్ర విసర్జన సౌకర్యాలలేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆటో యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఆటో యూనియన్ సభ్యులు యలగొండ శ్రీను నాయకత్వంలో మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దేవ వర కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆరోగ్యం, హైజీన్ దృష్ట్యా వెంటనే పబ్లిక్ టాయిలెట్లను మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో గారు సానుకూలంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకుని పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు కొమరం సాంబశివరావు, గుడ్ల రంజిత్, ఇలియాజ్, కొమరం శ్రీకాంత్, ముత్యాల మధు, సిద్ధి వినయ్, సతీష్, కణితి రాము తదితరులు పాల్గొన్నారు.









