ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రైతు సదస్సు వీక్షణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులకు ఆదేశాలు

రైతు సదస్సు వీక్షణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
రైతు భరోసా కార్యక్రమం కింద రాష్ట్రంలోని వ్యవసాయ భూములన్నింటికీ రూ.9,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే రైతు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నాడు.

ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని రైతు వేదికల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించాడు.

జిల్లావ్యాప్తంగా ఉన్న 58 రైతు వేదికలలో కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు స్క్రీన్లు, మైకులు, టెంట్లు వంటి సాంకేతిక సదుపాయాలను సమకూర్చాలని కలెక్టర్ సూచించాడు. మంగళవారం రైతు వేదికలను పండుగ వాతావరణంలో మామిడి తోరణాలు, రంగవల్లులతో అలంకరించాలన్నాడు. అదే రోజు సాయంత్రం 4 గంటలకే రైతులు వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపాడు.

ఆడియో, వీడియో ప్రసారాల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు పరీక్షలు నిర్వహించాలని సూచించాడు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కుర్చీలు, మంచినీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించాడు. మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రచారం నిర్వహించాలని సూచించాడు.

ప్రతి రైతు వేదిక వద్ద రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల వారీగా ఎంతమందికి ఎంత మొత్తం రైతు భరోసా జమ అయ్యిందో సమాచారం అందుబాటులో ఉంచాలన్నాడు. రైతుల హాజరు వివరాలు నమోదు చేసి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించాడు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!