ప్రతి క్షణం
ప్రజల పక్షం

  పేదలకు ఇళ్లు మంజూరు చేయాలంటూ గ్రామ కమిటీ  – పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం సమర్పణ

పేదలకు ఇళ్లు మంజూరు చేయాలంటూ గ్రామ కమిటీ  – పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం సమర్పణ
కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలం,
సమత్ మోతె (గొల్లగూడెం) గ్రామపంచాయితీలోని పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు మలకం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గ్రామ పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇల్లు ప్రతి అర్హుడికి మంజూరు కావాల్సిందే” అని తెలిపారు. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇది తొలి చర్య అని పేర్కొన్నారు.
ఈ వినతి కార్యక్రమంలో కుంజ లక్ష్మయ్య, ఇర్ప నాగేశ్వరరావు, సుతారి నాగేశ్వరరావు, మలకం పుల్లయ్య, ఇర్ప స్వామి, కుంజ వెంకన్న తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!