ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఇంటి వద్దకే తపాలా సేవలు – పోస్టల్ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పోస్టల్ సేవలపై అవగాహన పెంచుతున్న ఐపీఓ రామ్మూర్తి

ఇంటి వద్దకే తపాలా సేవలు – పోస్టల్ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్

పోస్టల్ సేవలపై అవగాహన పెంచుతున్న ఐపీఓ రామ్మూర్తి

పినపాక, ఆధాబ్ న్యూస్:
మణుగూరు సబ్ డివిజన్ పరిధిలో తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టల్ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురువారం ప్రజలలో విశేష ఆసక్తిని రేపింది. మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాలకు చెందిన వందలాది మంది ప్రజలు హాజరై పోస్టల్ సేవలపై అవగాహన పొందారు.

ఈ కార్యక్రమంలో పోస్టల్ ఐపీఓ రామ్మూర్తి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాల ద్వారా ఇంటి వద్దకే తపాలా, ఆధార్, బీమా, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.

అతను మాట్లాడుతూ:
పోస్టల్ శాఖ ద్వారా అందే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక భద్రత పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సుకన్య సమృద్ధి ఖాతా, టైం డిపాజిట్, మంత్లీ ఇన్కమ్ స్కీం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం వంటి అనేక పొదుపు పథకాలూ అందుబాటులో ఉన్నాయి. కేవలం ₹250 తో సుకన్య ఖాతా ప్రారంభించవచ్చు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్రం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ లాంటి స్కీమ్స్ ద్వారా భవిష్యత్తు భద్రత పొందవచ్చు,” అని తెలిపారు.

అతను ఇంకా చెప్పిన ముఖ్యాంశాలు:

399 రూపాయలతో ₹10 లక్షల ప్రమాద బీమా అందుబాటులో ఉంది.

ఆధార్ సేవలు ఇంటికే వచ్చేవిధంగా తపాలా శాఖ కృషి చేస్తోంది.

ఐపిపిబి (ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్) ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్‌ఫోన్ లేని వారికి కూడా లభిస్తాయి.

ప్రతి గ్రామ పంచాయతీలో పోస్టాఫీస్ ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం సేవలు అందిస్తోంది.

ఈ సమావేశంలో ఎంపీపీ, ఎంవో సత్యనారాయణ, మణుగూరు పోస్టుమాస్టర్, మూడు మండలాలకు చెందిన పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని పోస్టల్ సేవలపై చురుకైన చర్చలు జరిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!