కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం పోలీస్ స్టేషన్లో రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కానిస్టేబుల్ దుర్గారావు తాజాగా ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ కావడంతో సహచరుల మధ్య ఘనంగా వీడ్కోలు సభ జరిగింది.
ఎప్పుడూ చిరునవ్వుతో, నిర్వినయంగా విధులు నిర్వహించిన దుర్గారావు ప్రయాణాన్ని సహచరులు కళ్ళలో తడి, హృదయాల్లో మమకారంతో వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ఎస్ఐ పీవీ నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ సింహాచలం తదితరులు ఆయనకు శాలువాతో సన్మానం చేసి, ఆయన సేవలను ప్రశంసించారు.
“విధి ప్రదేశం మారొచ్చు కానీ మానవ సంబంధాలు మారవు” అన్న మాదిరిగా, దుర్గారావుతో గడిపిన అందరికీ గుర్తుండిపోతాయని అధికారులు తెలిపారు. కొత్త స్థానంలో ఆయన మరింత ప్రజాభిమానాన్ని సంపాదించాలని ఆకాంక్షలు తెలిపారు.
Post Views: 77









