ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో లక్ష దాటిన అడ్మిషన్లు – ‘బడి బాట’ కు అద్భుత స్పందన

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి అనూహ్యంగా మంచి స్పందన లభిస్తోంది. ప్రారంభమైన ఐదు రోజుల వ్యవధిలోనే 1.17 లక్షల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

వీరిలో ఫస్ట్ క్లాస్‌కి మాత్రమే 55,000 మందికి పైగా విద్యార్థులు చేరడం విశేషంగా నిలిచింది. ఇది ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగినట్లు సూచిస్తోంది.

అదే విధంగా, ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు 18,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మారడం గమనార్హం. ఈ మార్పు వెనుక ప్రభుత్వం అమలు చేస్తున్న ‘బడి బాట’ కార్యక్రమం ప్రధాన పాత్ర పోషించిందని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం అడ్మిషన్ల సంఖ్య ఈసారి రెండు లక్షల మార్కును దాటే అవకాశం ఉంది అని విద్యాశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో అవసరమైన వసతులు, బోధన సిబ్బంది, విద్యా సామగ్రి కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలని విద్యా రంగ విశ్లేషకులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల పట్ల పెరుగుతున్న ప్రజల విశ్వాసం ఈ ఏడాది విద్యా రంగానికి కొత్త ఆశాజ్యోతి నింపింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్