ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏసీబీకి లంచం తీసుకుంటూ చిక్కిన విద్యుత్ శాఖ అధికారి – మహబూబాబాద్ జిల్లా ఎస్.ఈ నరేష్ రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్

ఏసీబీకి లంచం తీసుకుంటూ చిక్కిన విద్యుత్ శాఖ అధికారి – మహబూబాబాద్ జిల్లా ఎస్.ఈ నరేష్ రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్

మహబూబాబాద్, ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతిని నిరోధించే శాఖ (ఏసీబీ) మరోసారి తన దాడులతో దుమారం రేపింది. జిల్లా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సూపరిండెంట్ ఇంజనీర్ (ఎస్.ఈ) నరేష్ తన స్వగృహంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అధికారుల సమాచారం మేరకు, నరేష్ ఒక వ్యక్తి నుంచి రూ.80,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. దాడిలో లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉండగా, ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి భరించరానిదని, ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!