ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆహ్వానం – ఏజెన్సీ జర్నలిస్టుల “అలయ్.. బలయ్”

ఆహ్వానం – ఏజెన్సీ జర్నలిస్టుల “అలయ్.. బలయ్”
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ఏజెన్సీ ప్రాంతంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, గుర్తింపు పొందిన యూ ట్యూబ్, వెబ్‌సైట్, PDF పత్రికల జర్నలిస్టులందరికి ఈ ఆత్మీయ ఆహ్వానం.
యూనియన్లు లేదా ప్రెస్ క్లబ్‌లకు అతీతంగా, పూర్తిగా స్వచ్ఛందంగా జరగనున్న ఈ జర్నలిస్టుల సమ్మేళనం లక్ష్యం –
‘‘ఒక్కసారి కలుసుకుందాం.. మన మాట మనమే చెప్పుకుందాం..’’
రిపోర్టింగ్‌లో ఎదురవుతున్న సమస్యలు, స్థానిక మాఫియాల నుండి ఎదురవుతున్న ఒత్తిళ్లు, భద్రత అంశాలు, కొత్త సవాళ్లపై పరస్పర చర్చ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.
ప్రత్యేకంగా CG సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్, అలాగే రిస్క్‌తో కూడిన సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, గంజాయి మాఫియా వార్తలను ధైర్యంగా ప్రచురిస్తున్న ఏజెన్సీ విలేఖరులకు ఇదొక మైలురాయి కావాలి.

ఆహ్వానించువారు:
కొండూరి రమేష్ బాబు
సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ – రెలా న్యూస్ (వెబ్‌సైట్ & యూట్యూబ్)
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత
మాజీ అధ్యక్షుడు, TJF (TUWJ) ఖమ్మం జిల్లా

మరియు ఇతర సీనియర్ జర్నలిస్టు మిత్రులు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!