అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల… నంద్యాల జిల్లాలో జేబీపీ పార్టీ కార్యాలయ ప్రారంభం
అనంతపురం/నంద్యాల,ఆధాబ్ న్యూస్:
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP) నేతలు, ఆపై నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది, జేబీపీ వ్యవస్థాపకుడు మరియు జాతీయ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో కలిసి జేబీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి చేకూర్చి, సామాజిక న్యాయం కోసం పాటుపడటమే పార్టీ లక్ష్యం” అని తెలిపారు. నంద్యాల జిల్లాలో కొత్తగా ప్రారంభించిన పార్టీ కార్యాలయం జేబీపీ కార్యకలాపాలకు కేంద్రంగా మారనుందని, ఇది ప్రజాసేవకు మరింత దగ్గర చేసే వేదికవుతుందని చెప్పారు.









