ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఖమ్మం జిల్లాకు నూతన కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి బాధ్యతలు స్వీకరణ

ఖమ్మం జిల్లాకు నూతన కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి బాధ్యతలు స్వీకరణ

ఖమ్మం,ఆధాబ్ న్యూస్
ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి నిన్న అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఈ రోజు హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుదీప్ దురిశెట్టికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కలెక్టర్ పాత్ర కీలకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

అనుదీప్ దురిశెట్టి ఇప్పటివరకు పలు ముఖ్యపదవుల్లో పని చేసిన అనుభవం ఉన్నవారు. ఖమ్మం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి ప్రణాళికలకు ఆయన కృషి చేయనున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!